హైదరాబాద్ నగరంలోని టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక జూలై 9వ తేదీన అదృశ్యమైంది. 17 ఏళ్ల ప్రవళిక కనిపించకుండా పోయింది. ఆమె ఎత్తు సుమారు 4.5 అడుగులు, ఎరుపు రంగు చుడీదార్ ధరించి ఉంది. తెలుగు మాట్లాడగలదు. ప్రవళిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు.