హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో మంగళవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో, ప్రెసిడెంట్ అమర్నాథ్ తనపై వచ్చిన రూ. 69-70 కోట్ల చెల్లింపుల ఆరోపణలను ఖండించారు. కోర్టు ఆదేశాల మేరకే ఈ చెల్లింపులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, క్రికెట్ సంఘాలు అవినీతి ఆరోపణలతో మెరుపు ధర్నా చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.