హైదరాబాద్: కల్తీ ఆహారం.. సీపీ సజ్జనార్ వార్నింగ్

ఆహార కల్తీకి సంబంధించి నెల రోజుల్లో 61 కేసులు నమోదు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆహార కల్తీ కేసుల్లో 64 మందిని అరెస్టు చేశామన్నారు. పలు దాడుల్లో 15 టన్నుల ఆహార పదార్థాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. లాభాల కోసం సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కల్తీ లేని సమాజం కోసం, సురక్షితమైన ఆహారం కోసం మా పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్