విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పార్ధీవ దేహానికి నివాళులర్పించిన తలసాని, కోట 750కి పైగా చిత్రాల్లో అనేక పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారన్నారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.