నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని పాడుబడ్డ ఓ ఇంట్లో ఓ యువకుడు వీడియో తీసేందుకు వెళ్లి, లోపల మనిషి అస్తిపంజరం కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ దృశ్యాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు యువకుడిని స్టేషన్‌కు పిలిచి వివరాలు సేకరించారు. ఆ ఇంటి ఓనర్ విదేశాల్లో ఉన్నారని, ఇంటి వీటిని ఏడేళ్లుగా ఎవరూ ఉపయోగించలేదని స్థానికులు తెలిపారు.