నాంపల్లి అగ్నిప్రమాదం.. స్టాండర్డ్ ఫర్నిచర్ షాపు సీజ్

నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మరణించారు. ఈ ఘటనపై హైడ్రా సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బందితో కలిసి గురువారం (జనవరి 29) నాంపల్లిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్టాండర్డ్ ఫర్నిచర్ షాపును సీజ్ చేశారు. భద్రతా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. ప్రజలు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనల వీడియోలు/ఫోటోలను హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667కు పంపాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్