నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద గురువారం భారీగా పోలీసు బలగాలు మోహరించారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేత విషయంలో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో గాంధీ భవన్ ముట్టడికి హిందూ సంఘాలు పిలుపు నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ముట్టడికి వస్తున్న హిందూ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.