నిజాం కాలేజీలో పీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ కొరకు పీడీఎస్‌యూ అధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులపై కక్షకట్టిన రీతిలో వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన వద్దనే ఉంచుకున్న విద్యాశాఖపై తగిన దృష్టి పెట్టాలని, నిధులు కేటాయించాలని కోరారు.