హెల్తీగా ఉన్న పసిబిడ్డ తెలంగాణ పదేళ్ల కేసీఆర్ పాలనలో ICU లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్లో కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు. బావ, బావమరిది కలిసి అబద్ధాలు చెబుతున్నారని, బనకచర్ల విషయంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను తగిలించి టీడీపీకి, కాంగ్రెస్ కు లింక్ పెడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనపై, కాంగ్రెస్ పాలనపై ప్రజల ముందు చర్చ పెడదామన్నారు.