వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి, లైబ్రరీ చైర్మన్ రియాజుద్దీన్, కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో వీరు క్రమశిక్షణ కమిటీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖతో విభేదాలపై చర్చించే అవకాశం ఉంది.