పూటకో పార్టీ మారే పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదని పాశం యాదగిరిబుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రో, నాగేశ్వరరావుల కాలి గోటికి కూడా సరిపోరని, పత్రికా స్వేచ్ఛ గురించి పవన్ కు ఏం తెలుసని యాదగిరి ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నామని, చేగువేరా ఫోటోలతో గద్దర్ ను మోసం చేసి, ఇప్పుడు చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాజ్యాన్ని ప్రశ్నించే అధికారం పవన్ కళ్యాణ్ కు లేదని ఆయన మండిపడ్డారు.