రచయిత జూలూరి గౌరీ శంకర్ రచించిన బహుజనగణమన పుస్తకావిష్కరణ సభ సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పురాణాల నుండి ఇప్పటి వరకు దేశ ప్రజలకు సేవ చేసినవారిలో చాలా మంది బహుజనులే ఉన్నారని పేర్కొన్నారు. ఈ పుస్తకం సమాజంలో గొప్ప మార్పుకు దారితీస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.