హైదరాబాద్ నాంపల్లి ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో గురువారం అయాన్ ఖురేషి (20) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కంచన్‌బాగ్ పీఎస్ లో క్రిమినల్ కేసులో నాంపల్లి జువైనల్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా.. ముగ్గురు దుండగులు బ్యాట్, కత్తులతో దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. పాత కక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.