కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం–జీడిమెట్ల హెచ్ఏఎల్ ఏరియాలోని ఓ అద్దె ఇంటిపై సోదాలు నిర్వహించగా, వారి వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేవని గుర్తించారు. అనంతరం వారిని మెదక్ జిల్లా జోగిపేట డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్ఓటీ కూకట్పల్లి జోన్ సిబ్బంది పాల్గొన్నారు.