కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల పోచంపల్లిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. నల్తూరి సాయికుమార్ (28) అనే కార్ డ్రైవర్, భార్యతో విభేదాల కారణంగా మనస్తాపానికి గురై మే 5న రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు తన స్నేహితుడికి వాట్సాప్ సందేశం పంపినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం భార్య అనుష తన తల్లి ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.