స్క్రాప్ గోధుమలో ఒక్కసారిగా మంటలు... భయాందోళనలో స్థానికులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిపోచంపల్లిలో గల సురక్ష కాలనీ ప్రక్కన ఉన్న స్క్రాప్ గోదాంలోశనివారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మంటల తాకిడికి పక్కనే ఉన్న ఈతవనంలోని కొన్ని ఈత చెట్లు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి దుండిగల్ పోలీసులు కూడా చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్