కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి గండిమైసమ్మలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఒకమార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో గండి మైసమ్మ చౌరస్తా వద్ద కళా జాతర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారుల బృందం, తడిచెత్త పొడిచెత్త పైన పాటల రూపంలో వినిపించారు.