హాస్టల్ గదిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడ వెంకట సాయి లక్ష్మి బాయ్స్ హాస్టల్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కయ్యం రాజేందర్ రెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా వెలగనూరు గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి హాస్టల్ గది నం. 107లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఉదయం హాస్టల్ సిబ్బంది తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మృతుడు ఆస్థమా వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు, అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్