గాజులరామారం డివిజన్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్‌లో బీజేపీ డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. శ్రీనివాస్ రెడ్డి, మురళీ కృష్ణ, సోమేశ్ గురుస్వామి, నాగేష్ గురుస్వామి, శారదా, రమాదేవి, భాస్కర్, శంకర్ నాయుడు, మహేందర్ రెడ్డితో సహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్