బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని, రాష్ట్ర సాధనలో కేసీఆర్ చూపిన దీక్ష, పోరాటం చిరస్మరణీయమని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్