బహదూర్ పల్లి లో కారు బీభత్సం.... ఇద్దరికీ తీవ్ర గాయాలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లిలో, ఉదయగిరి కాలనీలో టీ పాయింట్ వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. ఏపీ 16 డిఎల్ 5216 నంబర్ గల ఇకో స్పోర్ట్ కారు రోడ్డుపై ఉన్న ఇద్దరిని ఢీ కొట్టింది. దీనితో తాత బానుదాస్ (40) మరియు మనవడు తనీష్ (16) అనే బాలుడికి రెండు కాళ్ళు విరిగిపోయాయని స్థానికులు తెలిపారు. పార్కింగ్ చేసిన పల్సర్, యాక్టివా బైకులు కూడా ధ్వంసమయ్యాయి. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారిలో ముగ్గురు పారిపోగా ఒకరు పోలీసులకు దొరికినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్