కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ నెల 26న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు, మొబైల్ ఫోన్‌ను లాక్కెళ్లిన కేసులో గోవింద్ సింగ్ (24), కరణ్ సింగ్ (21), హర్ధిప్ సింగ్ (19)లను అరెస్ట్ చేశారు. మరో మైనర్ నిందితుడు, పరారీలో ఉన్న ఒకరిని గుర్తించారు. నిందితుల నుంచి బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, హోండా డియో స్కూటర్, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.