కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాలను బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందజేశారు. గాజులరామారం, చింతల్, సుభాష్‌నగర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు రూ. 60 వేల నుంచి రూ. 3.25 లక్షల వరకు వైద్య సహాయం మంజూరైంది. అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.