ఫీజు బకాయిల విడుదల కోరుతూ నేడు కాలేజీలు బంద్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్, తెలంగాణ హయ్యర్ ఎడ్యు కేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ తో పాటు రాష్ట్రంలోని అనేక కాలేజీలు మూతపడే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్