తాగునీటి సమస్య పరిష్కరించిన కాంగ్రెస్ నేత

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీ, అంజిరెడ్డి బస్తీ వాసులు కొన్నేళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. ఆయన వెంటనే స్పందించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంజీరా వాటర్ పైప్‌లైన్‌ను మంజూరు చేయించారు.

సంబంధిత పోస్ట్