ఇంట్లోనే మృత్యువు.. నమ్మిన చేతులే కత్తులయ్యాయి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు వెల్లడించారు. చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన 85 ఏళ్ల సుశీలమ్మ హత్య కేసులో, ఆమె ఇంట్లో పనిచేసే పని మనిషి కవిత (36)ను పోలీసులు అరెస్టు చేశారు. బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

సంబంధిత పోస్ట్