హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లి సర్కిల్ 290వ డివిజన్, రామ్ రెడ్డి నగర్లో నిన్న అధికారులు షెడ్డును కూల్చివేసిన మరుసటి రోజే అదే స్థలంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న CMC కొంపల్లి సర్కిల్ అధికారులు షెడ్డు కూల్చివేతపై ఫిర్యాదును క్లోజ్ చేశారు. అయితే, నేడు అదే చోట పనులు తిరిగి ప్రారంభం కావడంతో అధికారుల చర్యలపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణమైతే కూల్చివేత తర్వాత వెంటనే పనులు ఎలా మొదలయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణమే పనులు నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.