స్కూల్ పై డిఇఓ, చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యురాలు దర్యాప్తు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని పూర్ణిమా విద్యానికేతన్ స్కూల్ ను ప్రస్తుతానికి మూసివేస్తున్నట్లు ఎంఈఓ జెమిలీ కుమారీ తెలిపారు. పసిపాపపై స్కూల్ ఆయా చేసిన దాడిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిఇఓ విజయ కుమారి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యురాలు సరిత సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారి సూచనల మేరకు స్కూల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్