దుండిగల్ బీజేపీలో డివిజన్ల అధ్యక్ష పదవుల పోటీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్‌లో బీజేపీ డివిజన్ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్ సర్కిల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బహదూర్‌పల్లి (294), దుండిగల్ (296) డివిజన్లకు ఆశావహుల నామినేషన్లు స్వీకరించి రాష్ట్ర పార్టీకి పంపించారు. బహదూర్‌పల్లి డివిజన్‌లో శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దుండిగల్ 296 డివిజన్‌లో ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని, ఎవరికైనా బాధ్యతలు వచ్చినా కలిసి పనిచేయాలని నాయకత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్