కార్ మెకానిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పైప్‌లైన్ రోడ్డులో తిరుమల బార్ ఎదురుగా ఉన్న కార్ మెకానిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో షెడ్‌లో ఉన్న ఒక కారు పూర్తిగా కాలిపోయింది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్