పాత్రికేయుడికిఆర్థిక చేయూతఅందించిన మాజీకౌన్సిలర్ శంకర్ నాయక్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పాత్రికేయుడు తేజోమూర్తి తల్లి అనారోగ్యం పాలవడంతో, దుండిగల్ మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. చికిత్స ఖర్చుల నిమిత్తం మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రూ. 21,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు గోలిపల్లి దయాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా, ప్రధాన కార్యదర్శి రెడ్డెబోయిన మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. సహాయం అందించిన శంకర్ నాయక్‌కు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్