కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126వ డివిజన్ సోమయ్య నగర్‌లో సాలాసార్ హనుమాన్ దేవాలయం వద్ద రూ. 3.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ హాల్‌కు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.