కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ తండా-2లో బాలానగర్ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ శిబిరంలో కాటరాక్ట్, రెటినా, చూపు సమస్యలకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి వైద్య సూచనలు అందించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్వామి నాయక్, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.