కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మహానగర్ కమిటీ హాల్‌లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.