బాచుపల్లిలో సాయి అనురాగ్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. భక్తులకు, స్థానికులకు అన్నదానం చేశారు. సమితి ప్రెసిడెంట్ కె. రామకృష్ణ సహకారంతోనే ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సమితి సభ్యులు పేర్కొన్నారు.