బహదూర్‌పల్లి ఇళ్ల కేటాయింపులపై హీట్…విచారణ డిమాండ్ ముదురింది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ నేత ఎఆర్. సాదు యాదవ్ ఆరోపించారు. గతంలో ఒక సొసైటీ ద్వారా అక్రమాలు జరిగాయని, కొత్త సొసైటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆయన తెలిపారు. ఇళ్ల కేటాయింపులపై పూర్తి స్థాయి విచారణ జరిపి, అర్హతలేని వారికి ఇచ్చిన ఇళ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్