హైదరాబాద్: హోర్డింగ్ ఢీకొని యువకుడు మృతి

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో కొమ్ము అజయ్ (19) అనే యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా ముదిమాణిక్యం ప్రాంతానికి చెందిన అజయ్, బాచుపల్లిలోని ఓ పీజీ హాస్టల్లో ఉంటూ డా.రెడ్డీ ల్యాబ్ లో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో కేటీఎమ్ బైక్ పై ప్రగతి నగర్ నుండి బాచుపల్లి వెళ్తుండగా, ఇంద్రానగర్ లోని పిస్తా హౌస్ ఎదురుగా ఉన్న అడ్వర్టైస్మెంట్ పోల్ ను ఢీకొని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించి, బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్