చెరువులో దూకిన వృద్ధురాలు.. క్షణాల్లో స్పందించిన హైడ్రా సిబ్బంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం పరిధిలోని రామన్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన 62 ఏళ్ల వృద్ధురాలు యాదమ్మను హైడ్రా49 టీమ్ సిబ్బంది చాకచక్యంగా ప్రాణాలతో బయటకు తీశారు. స్థానికుల సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఎస్‌ఓ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి చెరువులోకి దిగి యాదమ్మను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, ప్రాథమిక చికిత్స అనంతరం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ రక్షణ చర్యల్లో మేనేజర్ అశోక్, సిబ్బంది సంతోష్, శ్రీనయ్య, వంశీ కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్