కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ మగదుమ్ నగర్ లో మైనారిటీ నాయకులు ఎండీ. ఆజమ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సంగమమని, ఇఫ్తార్ కార్యక్రమం మత సామరస్యాన్ని చాటుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, పలువురు నాయకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.