కొంపల్లి సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ 290వ డివిజన్, రామ్ రెడ్డి నగర్లో భారీ షెడ్డు నిర్మాణంపై స్థానికంగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్మాణం వెనుక ప్రముఖ పత్రికల్లో పనిచేస్తున్న కొందరి అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పత్రికా రంగంలోని ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు ఈ వ్యవహారంలో ఎందుకు వినిపిస్తున్నాయనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. వారి ప్రభావం కారణంగానే కొంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.