దూలపల్లిలో అక్రమ షెడ్ కూల్చివేత.. మళ్లీ మొదలైన నిర్మాణం!

కొంపల్లి సర్కిల్ లోని దూలపల్లి లో సర్వే నంబర్లు 154, 157, 158 లో పంచాయతీ రోడ్డు కబ్జాపై ఆరోపణలు ఉన్నప్పటికీ అందులో నిర్మిస్తున్నటువంటి భారీ షెడ్ ను గతంలో అధికారులు నామమాత్రంగా గోడలు కూల్చి చేతులు దులుపుకున్నారు. అధికారుల ముందే లంచాలు ఇచ్చామని యజమాని ప్రశ్నించడం గమనార్హం. అధికారులు వెళ్లిన వెంటనే షెడ్ నిర్మాణం యథావిధిగా కొనసాగుతుండటం కొంపల్లి సర్కిల్‌లో అధికారుల తీరుకు అద్దం పడుతోంది. తెరవెనుక ఒక అగ్రనేత అండదండలతోనే ఈ అక్రమ నిర్మాణం నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕