శనివారం, కుత్బుల్లాపూర్ దుండిగల్ బహదూర్ పల్లిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో శ్రీ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దుర్గా అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం 7 పాయలు వద్ద అంగరంగవైభవంగా జరిగింది. శ్రీ సాయి సుబ్రహ్మణ్య సేవాసమితి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు శ్రీ గడ్డం శ్రీనివాస్, మహిళా భక్తులు గడ్డం అనిత, హరిత, రేణుక, అంజమ్మ, సత్యవతి, శారద, కనకాచారి, కిషోర్, ఆంజనేయులు పాల్గొన్నారు.