మహిళ సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ

మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ గారు, గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ (దేవేందర్ నగర్) లో అక్షర జ్యోతి మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్