తెలంగాణ ఖో-ఖో జట్టులో చోటు దక్కించుకున్న జీడిమెట్లవిద్యార్థి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి అజయ్, తన తండ్రి ఎస్ సురేష్ సహకారంతో, గత నెల 29, 30 తేదీలలో సెయింట్ మార్క్స్ హై స్కూల్ తాండూర్ లో జరిగిన స్టేట్ లెవెల్ ఎస్ జిఎఫ్ అండర్ 14 ఖోఖో టోర్నమెంట్ లో రంగారెడ్డి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నమెంట్ లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో, అజయ్ తెలంగాణ ఖోఖో అండర్ 14 బాయ్స్ జట్టుకు ఎంపికయ్యాడు.

సంబంధిత పోస్ట్