నిజాంపేట్ హౌసింగ్ సొసైటీలో కొలువుదీరిన మహా గణపతి లడ్డూ వేలం సోమవారం ఉత్సాహంగా జరిగింది. రెస్టోరర్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటలో తొలి లడ్డూను అక్షయ జ్యువెలర్స్ అధినేత శ్రీశైలం చారి రూ. 97 వేలకు, రెండో లడ్డూను టింకు రెడ్డి రూ. 72 వేలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం చారి, టింకు రెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తల్లారి వీరేష్, నగేష్ చారి, మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సాయికుమార్, రాజు, వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.