మేడే వేడుకల్లో కార్మికుల కృషికి గౌరవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ డి. పోచంపల్లిలోని ఆల్కలి మెటల్స్‌లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బిఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ జెండాను ఎగురవేశారు. మే డే అనేది సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల కఠోర శ్రమ, అంకితభావం, త్యాగాలకు గుర్తింపుగా జరుపుకునే వేడుక అని, పరిశ్రమలు కార్మికుల హక్కులను గౌరవిస్తూ, వారికి న్యాయమైన వేతనాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్