మురికివాడల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం..ఎమ్మెల్యే

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో సోనియాగాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా మురికివాడల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అభివృద్ధి పనులను వివరించగా, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ త్వరలో ప్రత్యేక రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. సోనియాగాంధీ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బండారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్