రంగారెడ్డి నగర్ డివిజన్ చింతల్ హెచ్ఎంటి కాలనీ పోచమ్మ తల్లి ఆలయంలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుత్తుల మీరా కుమార్, ఆర్గనైజేషన్ సెక్రెటరీ గుబ్బల లక్ష్మీనారాయణ, పారిశ్రామికవేత్త ఇళ్ల వినోద్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. గత 40 ఏళ్లుగా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ సంఘం ముందుకు సాగుతుందని తెలిపారు.