కొంపల్లి సర్కిల్ లోని శానిటేషన్ ఆరోపణలపై అధికారుల వివరణ

కొంపల్లి సర్కిల్ శానిటేషన్ విభాగంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అధికారులు వివరణ ఇచ్చారు. సంబంధిత DE, EE ల వివరాల ప్రకారం సిబ్బంది హాజరును ప్రస్తుతం పూర్తిగా FRS యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని తెలిపారు. విధులకు హాజరయ్యే సమయంలోనే సమయం, ఫొటోతో అటెండెన్స్ నమోదవుతుందని, ఈ ప్రక్రియలో మాన్యువల్ జోక్యానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే మున్సిపాలిటీ డ్రైవర్లను వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలను అధికారులు ఖండించారు. డ్రైవర్లను ఎక్కడా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం లేదని తెలిపారు. ఇటీవల వచ్చిన వార్తలో ప్రస్తావించిన ఆరోపణలపై సంబంధిత విభాగం తరఫున అధికారులు ఈ వివరణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕