రామ్ రెడ్డి నగర్‌లో అక్రమ షెడ్డు నిర్మాణంపై అధికారుల చర్యలు

కొంపల్లి సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ 290వ డివిజన్, రామ్ రెడ్డి నగర్‌లో నిర్మిస్తున్న భారీ షెడ్డు విషయంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. కొంపల్లి సర్కిల్ డీసీ లావణ్య ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసాద్ షెడ్డును కూల్చివేయించారు. ప్రభావవంతమైన వ్యక్తుల అండదండలతో నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ అదే స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕